కలం, నిజామాబాద్ బ్యూరో : గిరిజనుల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) అన్నారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని ఇందూరు నగరంలోని కోటగల్లీలో గల అల్లూరి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన్యం వీరుడి త్యాగం చిరస్మరణీయమన్నారు. బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు.
సమాజంలో అణగారిన వర్గాల కోసం జీవించిన మహా నాయకుడని కొనియాడారు. యువతలో దేశభక్తి ధైర్యం సేవా భావం పెంపొందించాల్సిన అవసరాన్ని అల్లూరి జీవితం నేర్పుతోందని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆదేశాలతో నగరానికి చెందిన అడ్వకేట్ దేశపతి సుదర్శన్ రావు 1987లో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం జయంతితో పాటు వర్ధంతిని నిర్విరామంగా చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు చింతకాయల రాజేందర్, మఠం పవన్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం, దేవా తదితరులు పాల్గొన్నారు.

