Mobile Popup Ad
Mobile Popup Ad

నా ఇద్దరు కుమారులను అలా పెంచుతా.. జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కలం, వెబ్ డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కుటుంబ విలువలకి ప్రాధాన్యం ఇచ్చే ఎన్టీఆర్ తన పిల్లల పెంపకం విషయంలో తీసుకుంటున్న నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటోంది. సమాజంలో మహిళల భద్రత, గౌరవంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో తారక్ స్పందిస్తూ.. తన ఇద్దరు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లను మహిళలను గౌరవించేలా పెంచుతానని హామీ ఇచ్చారు.

కేవలం చదువు, కెరీర్ మాత్రమే కాకుండా, ఆడవారిని గౌరవించడం అనేది బాధ్యతగా భావించి పెంచుతానని ఆయన తెలిపారు. మగపిల్లల పెంపకం (Parenting)లో ప్రతి తండ్రి ఇలాంటి మార్పు కోరుకుంటేనే సమాజం బాగుపడుతుందని తారక్ వ్యక్తం చేసిన ఈ భావాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>