పిడుగుల వర్షం.. 30 నిమిషాల్లో 30వేల సార్లు..

కలం, వెబ్​ డెస్క్​ : వర్షం పడుతున్నప్పుడు పిడుగులు పడడం సర్వసాధారణం. కానీ, పిడుగుల వర్షం (Thunderstorm) పడితే ఎలా ఉంటుందో ఊహించండి. ఇలాంటి అద్బుతమైన ప్రకృతి దృశ్యాలు నెదర్లాండ్​ లో ఆవిస్కృతమయ్యాయి. ఆ దేశ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను బీభత్సం సృష్టించింది.

గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం, వరుసగా మెరిసిన మెరుపులతో నగరం మొత్తం మారిపోయింది. దాదాపు నాలుగు గంటల పాటు నిరంతరంగా మెరుపులతో కూడిన పిడుగులు పడ్డాయి. 30 నిమిషాల పాటు 30 వేల పిడుగులు పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా సోషల్​ మీడియాలో హల్​ చల్​ చేస్తున్నాయి. కాగా, ఇలాంటి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడం అరుదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>