పులుల సంరక్షణ కోసం.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి గిరిజనుల తరలింపు!

కలం, వెబ్​ డెస్క్​: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (Amrabad Tiger Reserve) పరిధిలోని కోర్ ఏరియాలో నివసిస్తున్న గిరిజన కుటుంబాల పునరావాస ప్రక్రియను (Rehabilitation ) తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. మొదటి దశలో భాగంగా నల్లమల అటవీ ప్రాంతంలోని సార్లపల్లి, కుడిచింతల బైలు, తటిగుండాల పెంట, కొల్లంపెంట అనే నాలుగు గ్రామాల నుంచి మొత్తం 417 కుటుంబాలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 62.55 కోట్లను కేటాయించింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్వచ్ఛందంగా తరలింపునకు అంగీకరించిన 14 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 15 లక్షల చొప్పున పరిహారం చెక్కులను అందజేసి ఈ ప్రక్రియను ప్రారంభించారు.

ఈ తరలింపులో కుటుంబాలకు రెండు రకాల ప్యాకేజీలను ప్రభుత్వం ఆఫర్ చేసింది. 160 కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. 15 లక్షల చొప్పున నగదు పరిహారాన్ని ఎంచుకోగా, మిగిలిన 257 కుటుంబాలు సమగ్ర పునరావాస ప్యాకేజీని కోరుకున్నాయి. ఈ ప్యాకేజీ కింద నాగర్‌కర్నూల్ జిల్లాలోని బాచారం వద్ద ప్రతి కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, నివాస స్థలం, పక్కా ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. అడవి లోపల విద్యా, వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్న గిరిజనులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తోంది. దాదాపు 1,501 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని పులుల సంరక్షణ కోసం మానవ జోక్యం లేని జోన్‌గా మార్చడమే ఈ తరలింపు ప్రధాన ఉద్దేశ్యం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>