Mobile Popup Ad
Mobile Popup Ad

జస్టిస్ సుదర్శన్‌రెడ్డిపై అమిత్ షా సంచలన కామెంట్స్

కలం, నేషనల్ డెస్క్ : రాజ్యాంగం ముసుగు వేసుకుని నక్సలైట్ భావజాలంతో వ్యవహరిస్తున్నారంటూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)  కీలక వ్యాఖ్యలు చేశారు. నేరుగా ఆయన పేరును ప్రస్తావించి పలు అంశాలను ఉదహరించారు. నక్సలైట్ చర్యలతో అటవీ ప్రాంతాల్లో ఆదివాసీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దాన్ని నియంత్రించడానికి సల్వ జుడుం వ్యవస్థ ఉనికిలోకి వస్తే దాన్ని రాజ్యాంగ విరుద్ధ సంస్థ అంటూ తీర్పు ఇచ్చిందే జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అని అమిత్ షా గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో నందినీ సుందర్ దాఖలు చేసిన పిటిషన్‌ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి (Sudershan Reddy) బెంచ్ ముందుకు విచారణకు వచ్చిందని, ఆ సంస్థను రాజ్యాంగ విరుద్ధమైన సంస్థగా తీర్పు ఇచ్చారని నొక్కిచెప్పారు. సల్వజుడుం పేరుతో ఏర్పడిన మిలీషియా విభాగం చట్టవిరుద్ధమైనదిగా పేర్కొన్నారని అమిత్ షా అప్పటి అంశాన్ని గుర్తుచేశారు.

ఆయనకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం విడ్డూరం

సల్వజుడుం దగ్గర ఉన్న ఆయుధాలన్నింటినీ ప్రభుత్వానికి అప్పగించాలంటూ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆ తీర్పులో పేర్కొన్నారని అమిత్ షా గుర్తుచేశారు. ఇకపైన ఆ సంస్థకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడాన్ని కూడా ఆపేయాలన్నారని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడాలంటూ సల్వ జుడుం సంస్థ రాజ్యాంగం విరుద్ధంగా నడుస్తున్నదంటూ ఆ తీర్పులో చెప్పారని పేర్కొన్నారు. సల్వ జుడుం సంస్థను రాజ్యమే ప్రోత్సహిస్తున్నదని, ఇలాంటి సంస్థలు రాజ్యాంగ విరుద్ధమైనవంటూ తీర్పులోని అంశాన్ని గుర్తుచేశారు. ఆ తర్వాత సల్వ జుడుం వ్యవస్థ రద్దయిందని, దానికి కొనసాగింపే ఆ సంస్థతో సంబంధం ఉన్నవారందరినీ మావోయిస్టులు వేటాడి మరీ చంపేయడమన్నారు. అలాంటి వ్యక్తి భావజాలంలోనే మావోయిస్టు ఐడియాలజీ ఉన్నది. ఆయన్ను కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం బాధాకరమన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>