చర్చకు రెడీ.. రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్

కలం, వెబ్ డెస్క్: రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలపై పార్లమెంటులో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. పార్లమెంటుని ప్రత్యేకంగా సమావేశపరిచి ఈ అంశంపై చర్చిద్దామని.. అందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారా..? అని సవాల్ విసిరారు. “రాహుల్ గాంధీ ఒప్పుకోరని నాకు తెలుసు. ఓట్ల చోరీపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అర్ధరహితం. పార్లమెంటులో చర్చిద్దామంటే రాలేరు కానీ, వీధుల్లో మాత్రం గొడవలు చేస్తూ నాటకమాడుతున్నారు” అని మండిపడ్డారు. యూపీలోని లక్నోలో జరిగిన సమావేశంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు.

అంపైర్‌ను తప్పుబడుతారా..?

సాధారణంగా మ్యాచ్‌లో ఓడిపోతే మరింత ఎక్కువగా ప్రాక్టీస్ చేసి గెలిచేందుకు ప్రయత్నించాలి తప్ప అంపైర్‌ను తప్పుబడుతామా..? అని అమిత్ షా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మాత్రం ప్రతి ఎన్నికల్లో ఓడిపోయాక ఓట్ల చోరీ జరిగిందని గగ్గోలు పెడుతున్నారని అమిత్ షా ఎద్దేవా చేశారు. అఖిలేష్ యాదవ్ కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారని విమర్శించారు. “హర్యానాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమినే ఎక్కువ సీట్లు సాధించింది. బీహార్ రాష్ట్రంలో మొదటిసారి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఢిల్లీలో మూడు దశాబ్దాల తరువాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పుదుచ్చేరిలో మరోసారి అధికారంలోకి వచ్చాం. అసోంలో వంద సీట్లతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించాం. ఇక బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీని ఊడ్చి పారేశాం” అని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>