Mobile Popup Ad
Mobile Popup Ad

పవర్ ఫుల్ అణ్వాయుధ పరీక్ష చేసిన అమెరికా.. ప్రపంచ వ్యాప్తంగా చర్చ

పశ్చిమాసియాలో యుద్ధం సాగుతున్న వేళ.. అమెరికా (America) చర్య ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. అమెరికా అత్యంత పవర్ ఫుల్ అణ్వాయుధ పరీక్ష చేసింది. కాలిఫోర్నియా తీరంలోని వాండెన్ బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఈ టెస్ట్ చేసింది అమెరికా. మినిట్ మ్యాన్ 3ని అమెరికా మరోసారి పరీక్షించింది. స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఐ ల్యాండ్స్ లో నిర్దేశించిన లక్ష్యాన్ని సక్సెస్ ఫుల్ గా ఇది ఛేదించిందని అమెరికా స్పేస్ ఫోర్స్ వెల్లడించింది. ఈ వెపన్ లోని ప్రతి విభాగం శక్తిని తెలుసుకునేందుకు ఈ టెస్ట్ చేసినట్టు అమెరికా స్పేస్ ఫోర్స్ తెలిపింది.

అయితే ఓ వైపు ఇరాన్ తో యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా (America) ఈ టెస్ట్ చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధునాతన ఆయుధాలను ఇరాన్ మీద ప్రయోగిస్తామని ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే ఈ టెస్ట్ జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఈ మినిట్ మ్యాన్-3 అత్యంత పవర్ ఫుల్. నిముషాల్లోనే లక్ష్యాన్ని ఛేదించేస్తుంది. 5వేల మైళ్ల దాకా గంటలో ప్రయాణించగలదు. అతిపెద్ద అణుబాంబులను ఇది మోసుకెళ్లగలదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>