కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) నేడు వైఎస్ జగన్ (YS Jagan)ను ఆయన నివాసంలో కలిశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్ట్ అయ్యిన అంబటి, పలు కేసుల్లో జైలు శిక్ష అనంతరం రెండు రోజుల క్రితం విడుదలయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ను కలిసి పలు విషయాలపై చర్చించారు. అంబటి తనపై జరిగిన దాడి, కేసుల గురించి జగన్‌కు వివరించారు. తప్పుడు కేసులకు అధైర్యపడవద్దని జగన్ అంబటికి సూచించారు. న్యాయపరంగా ఎదుర్కొందామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జగన్ అంబటికి కీలక సూచనలు చేశారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ప్రజా పోరాటాన్ని కొనసాగించాలని చెప్పారు. అలాగే అంబటి విషయంలో పోలీసుల తీరును తప్పుపట్టారు. కొంతమంది అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. రాంబాబు జైలులో ఉన్నప్పుడు జగన్ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అంబటి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో స్వయంగా వెళ్లి పరిశీలించారు.


