ఏనుగు విగ్రహం మధ్యలో ఇరుక్కుని భక్తుడి అవస్థలు!

కలం, వెబ్ డెస్క్: పాపాలు తొలగిపోతాయని, కోరికలు నెరవేరుతాయని నమ్మిన ఓ భక్తుడు నానా తంటాలు పడ్డాడు. ఏనుగు విగ్రహం మధ్యలో చిక్కుకుని అవస్థలు పడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్‌లో నర్మదా ఆలయంలో (Amarkantak Temple) ఉన్న ఏనుగు విగ్రహం కింద నుంచి పాకుతూ వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి మధ్యలోనే ఇరుక్కుపోయాడు.

మధ్యలోనే చిక్కుకుపోవడంతో నేలపై పడుకుని అటూ ఇటూ తిరుగుతూ బయటపడేందుకు కష్టపడ్డాడు. చుట్టూ ఉన్న భక్తులు అతడిని చూస్తూ సలహాలు ఇస్తుండగా, తీవ్రంగ శ్రమించిన భక్తుడు ఎట్టకేలకు బయటపడ్డాడు. భక్తుల నమ్మకం ప్రకారం.. ఏనుగు విగ్రహం కింద నుంచి సులభంగా బయటపడితే పవిత్రుడని, మధ్యలో ఇరుక్కుంటే పాపాలు చేసిన వ్యక్తి అని భావిస్తారు. ఈ విచిత్రమైన ఆచారం, భక్తుడి అవస్థలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

Also Read : పెళ్లింట్లో ఏనుగుల గుంపు.. ఇళ్లు ధ్వంసం, బియ్యం తినేసిన గజరాజులు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>