పెళ్లింట్లో ఏనుగుల గుంపు.. ఇళ్లు ధ్వంసం, బియ్యం తినేసిన గజరాజులు

కలం, నేషనల్‌ డెస్క్‌ : ఓ గిరిజన కుటుంబంలో పెళ్లి వేడుక జరుగుతుండగా ఏనుగుల గుంపు గ్రామంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించింది (Elephant Herd Attacks). నాలుగు ఏనుగులు ఒక్కసారిగా రావడంతో గ్రామస్థులు ప్రాణభయంతో పరుగులు తీయగా, పెళ్లింట్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కేశ్‌మర్దా గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామంలో బైగా కుటుంబానికి చెందిన వివాహ వేడుక జరుగుతున్న సమయంలో అడవి నుంచి వచ్చిన ఏనుగులు జనావాసాల్లోకి చొరబడ్డాయి.

రెండు బైగా కుటుంబాలకు చెందిన ఇళ్లను ధ్వంసం చేయడంతో పాటు పెళ్లి విందు కోసం సిద్ధం చేసిన బియ్యాన్ని తినేశాయి. మిగిలిన ఆహార పదార్థాలను చిందరవందర చేసి గ్రామంలో భయానక పరిస్థితులు సృష్టించాయి. ఏనుగుల దాడితో గ్రామస్థులు రాత్రంతా భయాందోళనల మధ్య గడిపారు. గత వారం రోజులుగా ఏనుగుల గుంపు ఈ ప్రాంతంలో సంచరిస్తుండటంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

ఏనుగుల సంచారంతో గ్రామస్థులు పొలాలకు, ఇళ్ల బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఘటనలో ఇళ్లు ధ్వంసం కావడంతో బాధిత కుటుంబాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాయి. పెళ్లి వేడుకకు సంబంధించి ఆహార పదార్థాలు నాశనం కావడంతో ఇబ్బందులు మరింత పెరిగాయి. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించడంతో పాటు జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని గ్రామస్థులు అటవీ శాఖ, ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>