మహిళా కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా ఆకుల కల్పన

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షరాలుగా గాంధారి మండల కేంద్రానికి చెందిన ఆకుల కల్పన(Akula Kalpana) నియమితులయ్యారు. ఈ మేరకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గాంధీభవన్‌లో నియామక పత్రాన్ని సోమవారం అందచేశారు. పార్టీ శ్రేయస్సుకు కృషి చేయాలని ఎర్రబెల్లి సూచించారు. ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు జిల్లాలో మహిళా కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు.

సభ్యత్వం నమోదుతో పాటు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు. తన నియమానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్, జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్, ఎల్లారెడ్డి నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నాయకురాలు అరుణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గాంధారి మాజీ ఎంపీపీ ఆకుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>