కలం, యాదాద్రి భువనగిరి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి మోసం చేస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా రైతుబంధు సమితి మాజీ చైర్మన్ కొలుపుల అమరేందర్ (Amarender Kolupula) అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి పాలనలోని 420 వాగ్దానాలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఏడు రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా భువనగిరి మండలం గౌస్ నగర్ రైతువేదిక క్లస్టర్ వద్ద గురువారం భారీ నిరసన (BRS Protest) కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా రైతుబంధు సమితి మాజీ చైర్మన్ కొలుపుల అమరేందర్ పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా రైతులు, మహిళలు, వృద్ధులు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతులకు ఎకరానికి రూ. 15 వేలు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించి, అర్హులైన రైతులందరికీ వర్తింపజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ రైతుబంధు సమితి అధ్యక్షులు కంచి మల్లయ్య, బండ సోమవారం సర్పంచ్ జంగయ్య, గౌస్ నగర్ మాజీ సర్పంచ్ ఈర్ల కృష్ణ, నాయకులు తోటకూరి శంకరయ్య, దేవిరెడ్డి పోసిరెడ్డి, నల్లమాస కుమార్ తదితరులు పాల్గొన్నారు.

