‘రేవంత్‌ బ్లాక్ మెయిల్ చేయడంతో’.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ తరువాత కొండా సురేఖ (Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తొలగించాలనే ఉద్దేశం అధిష్ఠానానికి లేకపోయినా.. సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేయడంతోనే బర్తరఫ్ చేశారని తెలిపారు. కొండా సురేఖను తప్పించకపోవడంతో తాను పార్టీ నుంచి వెళ్లిపోతానని ముఖ్యమంత్రి బెదిరించడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో తనను తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఉసురు కచ్చితంగా తప్పకుండా తగులుతుందన్నారు. తన కోసం చిన్నారెడ్డిని అనవసరంగా బలి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కూతురి వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవించానని.. ఆమె ఆలోచనను తాను ఎలా కాదంటానని ప్రశ్నించారు.

ఆ నలుగురే నాపై కుట్ర..

సీఎం రేవంత్ రెడ్డి సోదరులు కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనపై కుట్ర చేసి, బర్తరఫ్ చేయించారని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని చాలా మంది విమర్శిస్తున్నారని, కానీ తన విషయంలో మాత్రం ఇలా చేశారని ఆరోపించారు. ఈ విషయంలో రేవంత్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.

పార్టీ మారే ఆలోచన తనకు ఇప్పుడే లేదన్నారు. నా కూతురి మాట్లాడిన విషయాలను ఆయుధంగా చేసుకుని, పెద్ద కుట్రకు తెరలేపారన్నారు. సుస్మితతో మేం ఎప్పుడూ మాట్లాడించలేదన్నారు. ఆమె వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని కూడా చెప్పారు. రేవంత్ రెడ్డిని తిట్టినవారికి కూడా పదవులు వచ్చాయని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్నది తామేనని.. వైఎస్సార్ తరువాత ఆయన్ను మాత్రమే అంతలా అభిమానించామని కొండా సురేఖ (Konda Surekha) స్పష్టం చేశారు.

Also Read : రాష్ట్ర ప్రభుత్వానికి కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>