కలం, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ అల్వాల్ (Alwal) ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. వరకట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సంగీత (22)కి రమేశ్ అనే వ్యక్తితో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లయినా కొన్ని నెలల వరకు బాగానే ఉన్నా.. ఆ తరువాత అదనపు కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయి. అమ్మాయి తరఫు వారు ఎంత నచ్చచెప్పినా.. రమేశ్ మాత్రం వేధింపులు ఆపలేదు. దీంతో, జీవితంపై విరక్తి చెందిన సంగీత ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని బాధిత యువతి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Also: రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది: సీఎం రేవంత్
Follow Us On: Instagram

