Mobile Popup Ad
Mobile Popup Ad

అలా చేస్తే బీజేపీకి లాభం లేదు: జేపీ

కలం, వెబ్ డెస్క్ : డీ లిమిటేషన్ అమలైతే బీజేపీకి రాజకీయంగా వచ్చే లాభం పెద్దగా ఏం ఉండదని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ (Jayaprakash Narayan) స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి బలమే లేదని వివరించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకే లాభం జరుగుతుందని.. దక్షిణాదికి తీవ్ర నష్టం తప్పదన్నారు. ఏపీలో 25 ఎంపీ సీట్ల నుంచి 20కి, తెలంగాణలో 17 ఎంపీ సీట్ల నుంచి 14కి, కర్ణాటకలో 28 ఎంపీ సీట్ల నుంచి 26కి, తమిళనాడులో 39 ఎంపీ సీట్ల నుంచి 29కి సీట్లు, కేరళలో 13 ఎంపీ సీట్ల నుంచి 20కి తగ్గుతాయని తెలిపారు. డీ లిమిటేషన్ పై నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై స్పందిస్తూ.. ఈ బిల్లును వ్యతిరేకించి ప్రతిపక్షాలు చారిత్రక తప్పిదం చేశాయని మండిపడ్డారు.

Read Also: ‘సారీ చెప్పండి’.. వైఎస్.భారతీ రెడ్డి డిమాండ్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>