కలం, వెబ్ డెస్క్: విపక్షాల ఐక్యతతో కేంద్ర ప్రభుత్వం ఓడిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) స్పష్టం చేశారు. ఢిల్లీలో శనివారం నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఇది రాజకీయ ఓటమి కాదని.. బీజేపీ విధానాలకు జరిగిన ఓటమి అని విమర్శించారు. రిజర్వేషన్లు అమలు చేసేందుకు కుట్ర జరిగిందన్నారు. మూడు బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలు చేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 మహిళా బిల్లును యథావిధిగా అమలు చేయాలన్నారు. ప్రజల్లో ఎవరికీ మద్దతు ఉందొ ప్రజాక్షేత్రంలో తేలుతుందని చెప్పారు. యూపీ ఎన్నికల లోపు మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉందని చెప్పారు.

