Mobile Popup Ad
Mobile Popup Ad

ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రైన‌‌ దినేశ్ కార్తీక్‌..!

కలం, వెబ్ డెస్క్ : భారత మాజీ క్రికెటర్, ఆర్సీబీ ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రయ్యారు. అత‌డి భార్య‌, స్క్వాష్ స్టార్ ప్లేయ‌ర్ దీపికా పల్లికల్ పండంటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ విషయాన్ని దినేశ్, దీపిక జోడీ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లడించింది. అంతేకాదు తమ పాపకు ‘రాహా పల్లికల్ కార్తీక్’ అని పేరు పెట్టినట్లు ఈ జంట చెప్పుకొచ్చింది. ఈ మేరకు ‘మా మనసు నిండా దేవుని ఆశీస్సులు, చెప్పలేనంత కృతజ్ఞతతో మా ముద్దుల పాపను ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నాము. కబీర్, జియాన్ తమ చిన్న చెల్లాయి రాహాను పరిచయం చేస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు’ అని సోషల్ మీడియా పోస్టులో రాశారు. దీంతో ఈ దంపతులకు సెలబ్రెటీలు, ఫ్యాన్స్, నెటిజన్లు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.

కాగా, దినేశ్ కార్తీక్ భార్య దీపికా పల్లికల్ (Dipika Pallikal) భారతదేశపు గొప్ప స్క్వాష్ క్రీడాకారిణి.ప్రపంచ స్క్వాష్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి చేరిన తొలి భారతీయ మహిళ. పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆమె కామన్వెల్త్ , ఆసియా క్రీడల్లో ఎన్నో పతకాలు సాధించారు. ఆమె చివరగా ఆసియాగేమ్స్-2023లో మిక్సిడ్ డబుల్స్‌లో గోల్డ్ మెడల్ తో మెరిసింది. అంతకు ముందు వరల్డ్ డబుల్స్ ఛాంపియన్ షిప్-2022లో రెండు స్వర్ణ పథకాలు సాధించారు.ఇదిలాఉంటే 2015 ఆగస్టు 18న దినేశ్ కార్తీక్, దీపికా పల్లికల్ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం జరిగిన వారి వివాహం విశేషంగా నిలిచింది. 2021లో వీరికి ఇద్దరు మగ కవల పిల్లలు పుట్టారు. వారి పేర్లు కబీర్, జియాన్‌గా నామకరణం చేశారు. ఇప్పుడు 40 ఏళ్ల వయసులో డీకే థర్డ్ టైమ్ తండ్రి అయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>