Mobile Popup Ad
Mobile Popup Ad

అల్లు అర్జున్-లోకేశ్ ప్రాజెక్ట్‌ బిగ్ అప్‌డేట్.. లుక్ టెస్ట్ ఫిక్స్

కలం, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లుక్ టెస్ట్ (Look Test) రేపు ముంబైలో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప’ సిరీస్ విజయాల తర్వాత అల్లు అర్జున్ భారీ చిత్రాలను ఓకే చేస్తున్నారు. అలాగే ‘విక్రమ్’, ‘లియో’, ‘కూలీ’ వంటి చిత్రాలతో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ వరుస సూపర్ హిట్స్ అందుకున్నారు. దీంతో వీరిద్దరి కలయికలో రానున్న సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ లుక్ టెస్ట్‌లో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన గెటప్, స్టైలింగ్, మేకోవర్ అంశాలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లుఅర్జున్  గతంలో ఎన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించనున్నాడు.  ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా షూటింగ్, నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలు మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>