Mobile Popup Ad
Mobile Popup Ad

అల్లు అర్జున్ అభిమాన సంఘం గొప్ప మనసు.. చిన్నారికి సాయం

కలం, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (Allu Arjun Fans Association) మరోసారి తమ సేవా కార్యక్రమాలతో మనసులు గెలుచుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కరంపూరి సతీష్ కుమార్తె నక్షిత వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించింది. పుట్టినప్పటి నుంచి నక్షిత “అనోరెక్టల్ మాల్ఫార్మేషన్” అనే జన్యుపరమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. ఈ సమస్య కారణంగా ఇప్పటికే ఆమెకు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. త్వరలో మరో శస్త్రచికిత్స జరగనుంది. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు వెంటనే స్పందించి, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఫ్యాన్స్ అసోసియేషన్ కేవలం సినిమాలకే పరిమితం కాదని.. సభ్యులు, వారి కుటుంబాలకు కష్టసమయంలో అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. అవసరమైన ప్రతి సందర్భంలో సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సహాయం పట్ల కరంపూరి సతీష్ కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఫ్యాన్స్ అసోసియేషన్ చేసిన ఈ మానవతా సేవపై అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>