కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) మంచి నటి మాత్రమే కాదు.. ఫ్యాషన్ ఐకాన్ కూడా. నిత్యం ఆకట్టుకునే ఫ్యాషన్ దుస్తులతో మెరిసిపోతూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో అలియా ప్రతిష్టాత్మకమైన కేన్స్ చలనచిత్ర ఉత్సవాల్లో (Cannes Film Festival) తళుక్కున మెరిసింది. ‘లోరియల్ పారిస్’ గ్లోబల్ అంబాసిడర్‌గా ఫ్రెంచ్ అందాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా రూపొందించిన గౌనులో మెరిసిపోయింది. లేత ఆకుపచ్చ, నీలం, లావెండర్ రంగుల కలయికతో కూడిన దుస్తుల్లో క్వీన్‌లా అకట్టుకుంది.
సింపుల్ మేకప్, అందమైన హెయిర్‌స్టైల్, చిన్నపాటి ఇయర్ రింగ్స్‌తో హుందాగా కనిపించింది. భారత్ నుంచి ఐశ్వర్యా రాయ్ బచ్చన్, కరణ్ జోహార్ వంటి ప్రముఖులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. గత ఏడాది కూడా కేన్స్‌లో ఆకట్టుకున్న అలియా ఈసారి ‘సమ్మర్ డ్రీమ్’ లుక్‌తో ఫ్యాషన్ ప్రియుల మనసు గెలుచుకుంది.

