epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అఖండ 2 ఇష్యూ.. రంగంలోకి దిల్ రాజు..

కలం, వెబ్ డెస్క్: అఖండ 2(Akhanda 2) ఆగిపోయింది. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు. అంతా దీని గురించే చర్చ. ఈరోస్ సంస్థకు చెల్లించాల్సింది అసలు, వడ్డీతో కలిపి రూ.52 కోట్లు అయింది. ఆ మొత్తాన్ని కడితే గానీ ఈరోస్ మద్రాస్ కోర్టులో కేసు వెనక్కు తీసుకోదు. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మాతలు రామ్, గోపీ ఈ మొత్తాన్ని సెటిల్ చేసుకుని వీలైనంత త్వరగా అఖండ 2(Akhanda 2) రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కానీ వీరిద్దరితో పాటు మరో నిర్మాత అనిల్ సుంకర కూడా ఈ ఫైనాన్స్ కట్టాలి. పైగా ఈరోస్ సంస్థ అధినేత ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు. ఇప్పుడు అనిల్ సుంకరను ఒప్పించి ఈరోస్ తో ఎంతో కొంత సెటిల్ చేసుకుని ఎన్వోసీ తీసుకోవడం రామ్, గోపీకి పెద్ద తలనొప్పి అయిపోయింది.

అందుకే ఇందులోకి దిల్ రాజు ఎంట్రీ ఇచ్చాడంట. రామ్, గోపీ, అనిల్ మధ్య ఒప్పందాన్ని కుదిర్చి.. అటు ఈరోస్ తో మాట్లాడి ఎంతో కొంత సెటిల్ చేసే పనిలో ఉన్నాడు దిల్ రాజు. ఈరోస్ అధినేతతో దిల్ రాజు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా.. అతను ఫోన్ లో అందుబాటులోకి రావట్లేదు. కుదిరితే లండన్ కు వెళ్లాలని చూస్తున్నారు. ఈరోస్ మాత్రం మొత్తం కడితేనే రాజీకి ఒప్పుకుంటుందని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. దిల్ రాజుకు ముంబైలో ఉన్న పరిచయాలతో ఈరోస్ అధినేతను ఒప్పించే పనిలో బిజీగా ఉన్నారంట. అవసరం అయితే మొత్తం కట్టేందుకు కూడా రెడీగా ఉండాలని నిర్మాతలకు సూచించాడు దిల్ రాజు.

అఖండ 2పై భారీ అంచనాలున్నాయి. పైగా ట్రైలర్ చూస్తుంటే హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లేట్ చేస్తే నిర్మాతలకే నష్టం అని.. లాభాలను దృష్టిలో ఉంచుకుని సెటిల్ మెంట్ చేసుకోవాలని సూచించాడంట దిల్ రాజు. అందుకే రామ్, గోపీ ఈ విషయంలో అనిల్ సుంకరతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కుదిరితే ఈ నెలలోనే రిలీజ్ చేయాలని.. లేదంటే కొత్త ఏడాదిలోనే రిలీజ్ కు ప్లాన్ చేయాలంటున్నారు మేకర్స్.

Read Also: ఇండస్ట్రీలో సమానత్వం లేదు.. జాన్వీకి ప్రియాంక మద్దతు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>