యూపీఐ చెల్లింపులపై చార్జీలు.. కేంద్రానికి ఏఐవైఎఫ్ వార్నింగ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం యూపీఐ పై విధించిన అదనపు చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తాలో ఏఐవైఎఫ్ నాయకులు నిరసన (AIYF Protest) చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా యూపీఐపై 0.4 శాతం చార్జీలు వేయడం దుర్మార్గమన్నారు.

రూ.75,000 దాటితే రూ.300 వరకు చార్జీ వసూలు చేయడం సామాన్యుడిపై భారమని అన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సిపిఐ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ కొండపల్లి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, AIYF జిల్లా అధ్యక్షులు బసవరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, మహేష్ బాబు, సుందర్ రాజు, రెహమాన్, బద్రి, తన్వీర్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>