ఏఐవైఎఫ్ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవం

కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా అఖిల భారత యువజన సమైక్య (AIYF Karimnagar) జిల్లా కార్యవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర మంగళవారం తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా పోలోజు రంజిత్, కార్యదర్శిగా బ్రాహ్మణపల్లి యుగంధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కసి బోసుల సంతోష్ చారి, ఉపాధ్యక్షులుగా మ్యాకల రమ్య, మచ్చ రమేష్, సహాయ కార్యదర్శులుగా కాల్వ శ్రీనివాస్ యాదవ్, చెంచల మురళి, కోశాధికారి చెంచల రవిలతోపాటు 25 మందితో కౌన్సిల్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారిని ఉద్దేశించి ధర్మేంద్ర మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లాలో యువజన సంఘాన్ని ప్రతి గ్రామంలో బలోపేతం చేసి యువజన హక్కుల సాధన కోసం యువతను కదిలించాలని కోరారు. గ్రామ గ్రామన యువజన సంఘాన్ని నిర్మించి రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఇచ్చిన హామీల సాధన కోసం, నిరుద్యోగ భృతి, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం యువతను చైతన్యపరిచి పోరాటాల వైపు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

జిల్లాలో యువత కోసం ప్రత్యేక యువజన కేంద్రాలు, ప్రభుత్వ కోచింగ్ సెంటర్లు, ఉద్యోగ మార్గదర్శక కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఏర్పాటు కోసం పోరాటాలు చేయాలని సమగ్ర యువజన విధానం అమలు కోసం పోరాడాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>