Mobile Popup Ad
Mobile Popup Ad

ఎరువుల ధరలు తగ్గించాల‌ని రైతు సంఘం డిమాండ్

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) కోటగల్లిలోని శ్రామిక భవన్‌లో ఆదివారం అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) అర్బన్ జిల్లా కన్వీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో AIUKS జిల్లా కన్వీనర్ ఎం.నారాయణ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే కుట్రలు చేస్తుందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. యూరియా సప్లై పై ఫోన్ యాప్‌ను తొలగించాలని, సకాలంలో రైతులకు సరిపోయేంత యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. సబ్సిడీ ద్వారా రైతులకు సరిపోయేంత విత్తనాలు అందజేయాలని కోరారు. రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియో అందించాల‌న్నారు. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం రైతులు పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణయించి అమలు చేయాలని కోరారు. పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలన్నారు. కల్తీ విత్తనాలు పురుగు మందులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్‌లో AIUKS జిల్లా నాయకులు పడాల శంకర్, అరుగుల పోచయ్య, ఎస్కే నజీర్, తరుణ్, గంగామల్లు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>