సౌదీ అరేబియాకు విమానాలు నిలిపివేత

కలం, వెబ్ డెస్క్: సౌదీ అరేబియా (Saudi Arabia)లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి అక్టోబర్ 17వ తేదీ వరకు విమాన సర్వీసులు నిలిపేస్తున్నట్లు ఎయిరిండియా, ఇండిగో విమాన సంస్థలు ప్రకటించాయి. రియాద్, జెడ్డా, దమ్మమ్, మదీనా ఎయిర్‌పోర్టులకు తక్షణమే విమానాల రాకపోకలను నిలిపేస్తున్నట్లు వివరించాయి. ప్రయాణికుల టికెట్ల డబ్బులను వెంటనే రీఫండ్ చేసే ప్రక్రియ ప్రారంభించామని సంస్థ అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతనే తమకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని.. ఎయిర్‌పోర్టులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో సర్వీసులు నడిపించడం ఏమాత్రం సురక్షితం కాదని వివరించారు. తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామనేది ప్రయాణికులకు సమాచారం అందిస్తామని తెలిపారు.

అసలేం జరిగిందంటే..

సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారులు రెండు రోజుల క్షిపణి దాడులు చేశారు. అత్యంత రద్దీగా ఉండే రియాద్ ఎయిర్‌పోర్టుపైనే దాడికి దిగడంతో 13 మంది వరకు చనిపోయారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ యూసుఫ్ ప్రాణాలు కోల్పోగా.. కామారెడ్డి జిల్లాకు చెందిన షేక్ సయీద్ తీవ్రంగా గాయపడ్డారు. దమ్మామ్ ఎయిర్‌పోర్టుపై కూడా ఇలాంటి దాడే జరిగినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ఎయిర్‌పోర్టులకు విమాన సర్వీసులను తక్షణమే నిలిపేసిన సౌదీ అరేబియా ప్రభుత్వం.. వందల సంఖ్యలో విమానాలను దారి మళ్లించింది. అక్కడ నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా సర్వీసులను తాత్కాలికంగా నిలిపేయాలని ఎయిరిండియా, ఇండిగో నిర్ణయించాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>