Mobile Popup Ad
Mobile Popup Ad

అన్నాడీఎంకేలో చీలిక.. పళనిస్వామి షాకింగ్ నిర్ణయం

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులో విజయ్ సర్కార్ ఏర్పాటు వేళ అన్నాడీఎంకేలో చీలికలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడు అసెంబ్లీలో ఇవాళ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి 25 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంపై ఆ పార్టీ అధినేత పళనిస్వామి (Palaniswami) సీరియస్ గా ఉన్నారు. దీంతో పార్టీ పదవుల నుంచి ముఖ్య నేతలను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 26 జిల్లాలకు చెందిన నేతలను తొలగించారు. షణ్ముగం, వేలుమణితో పాటు వారి అనుచరులను తొలగించారు.

కాగా, తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బుధవారం బలపరీక్ష నెగ్గింది. విజయ్ ప్రభుత్వానికి 144 మంది సభ్యులు మద్దతు పలికారు. టీవీకే 105, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2, ఐయూఎంఎల్ పార్టీ నుంచి ఇద్దరు సభ్యులు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఒకరు మద్దతు తెలిపారు. అలాగే అన్నాడీఎంకే పార్టీలోని షణ్ముగం నేతృత్వంలోని 25 మంది ఎమ్మెల్యేలు బయటి నుంచి మద్దతు ఇచ్చారు. అయితే ఈ సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే సభ నుంచి వాకౌట్ చేసింది. మేజిక్ ఫిగర్ (119) ను దాటి మద్దతు ఉండడంతో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం బలపరీక్ష నెగ్గినట్లు జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>