Mobile Popup Ad
Mobile Popup Ad

‘ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్’కు ముహూర్తం ఫిక్స్ !

కలం, స్పోర్ట్స్: క్రికెట్ ప్రపంచంలో మరో భారీ టీ20 లీగ్ ఊపు ఊపేందుకు సిద్ధమైంది! ఈ ఏడాది డిసెంబర్ 27 నుంచి ప్రతిష్టాత్మక ‘ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్’ (Afghanistan Premier League) తొలి సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం కానుందని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) సంచలన ప్రకటన చేసింది. గడిచిన పదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్‌ను శాసిస్తూ, ప్రపంచవ్యాప్త లీగ్‌ల్లో టాప్ ప్లేయర్లుగా ఎదిగిన ఆఫ్ఘన్ స్టార్లు.. ఇప్పుడు సొంత లీగ్‌తో దుమ్మురేపడానికి రెడీ అయ్యారు.

ఈ మెగా టోర్నీలో కాబూల్, కాందహార్, బాల్ఖ్, పక్తియా, నంగర్హర్ ప్రాంతాల నుంచి మొత్తం 5 ఫ్రాంచైజీలు రణరంగానికి సై అంటున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లన్నింటికీ ప్రపంచ స్థాయి వసతులున్న యూఏఈ (UAE) వేదిక కానుంది. గతంలో ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లకు అడ్డాగా నిలిచిన యూఏఈ.. ఇప్పుడు ఈ లీగ్‌కు కూడా అదిరిపోయే ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ సరికొత్త లీగ్ దేశంలోని యంగ్ టాలెంట్‌కు ఒక లైఫ్ చేంజింగ్ ప్లాట్‌ఫామ్ కానుందని బోర్డు ధీమా వ్యక్తం చేసింది.

అంతర్జాతీయ దిగ్గజాలతో కలిసి ఆడే ఈ లీగ్.. దేశంలో క్రికెట్ మౌలిక సదుపాయాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్తుందని పేర్కొంది. ఈ టోర్నీ ఆఫ్ఘన్ క్రికెట్ భవిష్యత్తును మార్చేసే ఒక వ్యూహాత్మక అడుగు అని, దీని ద్వారా గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్లు వస్తాయని బోర్డు చైర్మన్ మీర్వైస్ అష్రఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్ టీ20 రేసులో అడుగుపెడుతున్న ఈ సరికొత్త లీగ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>