కలం, వెబ్ డెస్క్: నేటి యువ క్రికెటర్లు బెదురు లేకుండా ఆడటానికి కేవలం ప్రతిభే కారణం కాదని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) అభిప్రాయపడ్డారు. క్రికెట్‌ను కోచ్‌లు, వ్యాఖ్యాతలు చూసే విధానం మారడం వల్లే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. వైఫల్యాలను ఇప్పుడు సహజంగా అంగీకరిస్తున్నారని స్టెయిన్ చెప్పారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం కోచ్‌లు ఆటగాళ్లపై ఎక్కువ అవగాహనతో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రిస్క్ తీసుకుని విఫలమైనా తీవ్ర విమర్శలు రావడం తగ్గిందని తెలిపారు.
ఈ మార్పు వల్ల యువ ఆటగాళ్లు తమ సహజ ఆటను భయపడకుండా ఆడుతున్నారని చెప్పారు. వైభవ్ సూర్యవంశీ తొలి బంతికే సిక్సర్ కొట్టడం వంటి ఉదాహరణలు ఇప్పుడు సాధారణంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఒకప్పుడు అలాంటి ఆటను కొద్దిమంది మాత్రమే ఆడేవారని గుర్తు చేశారు. ఈ మార్పు బ్యాటర్లకే కాకుండా బౌలర్లలో కూడా కనిపిస్తోందని స్టెయిన్ (Dale Steyn) చెప్పారు. పరుగులు ఇచ్చినా వికెట్లు తీయాలనే ఆలోచనతో బౌలర్లు ముందుకు వెళ్తున్నారని వివరించారు.
విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ, ఎన్నేళ్లుగా అత్యున్నత స్థాయిలో నిలకడగా రాణించడం అతని ప్రత్యేకత అని ప్రశంసించారు. ఆటలో మెరుగుపడాలనే తపన కోహ్లీని ప్రత్యేకంగా నిలబెట్టిందన్నారు. క్రికెట్‌పై అవగాహన, విశ్లేషణ, కమ్యూనికేషన్ అన్నీ మారాయని స్టెయిన్ పేర్కొన్నారు. ఈ వాతావరణం ఆటగాళ్లకు మరింత స్వేచ్ఛ ఇవ్వడంతో ఆట కొత్త స్థాయికి చేరుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: రోహిత్, విరాట్ లేకపోతే వరల్డ్‌కప్ లేదు: ఇర్ఫాన్ పఠాన్
Follow Us On : WhatsApp

