అమెరికాకు భారత్ మరోసారి వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: ఒమన్ తీరంలో నిన్న వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత్ (India) అమెరికా తీరుపై ఢిల్లీలోని రాయబారిని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండో రోజు కూడా అమెరికా రాయబార కార్యాలయ అధికారి జాసన్ మీక్స్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించి వార్నింగ్ ఇచ్చింది. భారత్ నిరసనను వెంటనే అమెరికా ఉన్నత వ్యక్తులకు చేరవేయాలని.. పౌర వాణిజ్య నౌకలపై ఇలాంటి బలప్రయోగం ఏమాత్రం సరికాదని పేర్కొంది.

ఇలాంటి చర్యల కారణంగా అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత, రక్షణ, స్థిరత్వం దెబ్బతింటాయని స్పష్టం చేసింది. భవిష్యత్తులో పశ్చిమాసియా సహా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిపై అమెరికా బలగాలు ప్రాణాంతక దాడులను నివారించాలని డిమాండ్ చేసింది. మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని అమెరికాకు గట్టిగా హెచ్చరించింది.

Read Also: ఇరాన్‌తో త్వరలోనే శాంతి ఒప్పందం: ట్రంప్ ప్రకటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>