Mobile Popup Ad
Mobile Popup Ad

టమోటా లేని ‘టమోటా సాస్’.. అంతా రసాయనాలే!

కలం, వెబ్​ డెస్క్​ : ఫాస్ట్ ఫుడ్ ప్రియులకు ఇదొక చేదు నిజం. రోడ్డు పక్కన లభించే ఫాస్ట్ ఫుడ్, చౌమీన్, బర్గర్ల రుచిని పెంచేందుకు వాడే టమోటా సాస్ (Tomato Sauce) వెనుక ఉన్న ఒక వాస్తవం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని హాపూర్‌లో ఫుడ్​ సేఫ్టీ అధికారులు నిర్వహించిన దాడుల్లో దాదాపు 200 లీటర్ల కల్తీ సాస్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సాస్ తయారీలో కనీసం ఒక్క టమోటాను కూడా ఉపయోగించలేదు. కేవలం ప్రమాదకరమైన రసాయనాలు, యాసిడ్లు, కృత్రిమ రంగుల సాయంతో దీనిని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఇలాంటి విషపూరితమైన సాస్‌లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రాణాంతకమైన అల్సర్లు రావడమే కాకుండా, కిడ్నీల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ ధరకే లభిస్తుందని ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలను వాడటం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, కాబట్టి వినియోగదారులు అప్రమత్తంగా ఉండి బయట ఆహారం తీసుకునే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>