Mobile Popup Ad
Mobile Popup Ad

కరాటే పోటీలు.. విద్యార్థులను అభినందించిన మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: అంతర్జాతీయ కరాటే పోటీల్లో ప్రతిభ కనబర్చిన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల విద్యార్థులను రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) శుక్రవారం ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభినందించారు. మే 29 నుండి 31వరకు నేపాల్ దేశం కాట్మాండ్ లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్స్ షిప్ పోటీలల్లో కాల్వశ్రీరాంపూర్ మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రూషగాని వినూత్న అండర్ 9-10 బాలికల స్పారింగ్ విభాగంలో ప్రథమ స్థానం నిలువగా.. అండర్ 14-15 బాలికల స్పారింగ్ విభాగంలో వి.నిహారిక ప్రథమ స్థానంలో నిలిచారు.

దాసరి ధనస్విని 9-10 విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. ఓదెల గ్రామానికి చెందిన లాగిశెట్టి శరణ్య 16-17 బాలికల స్పారింగ్ విభాగంలో తృతీయ స్థానంలో నిలిచి బ్రౌంజ్ మెడల్ సాధించగా.. అండర్ 17-18 బాలికల స్పారింగ్ విభాగంలో ఎంబడి చందన తృతీయ స్థానం స్థానం బ్రౌంజ్ సాధించారు. కరాటే మాస్టర్ కాలువల రమేష్ ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీసులో కలువగా వీరిని మంత్రి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman) అభినందించారు.

Read Also: ‘రెడ్ జోన్’ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఈసారి వారికి టికెట్ డౌటే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>