జర్నలిస్టుల శిక్షణకు ఏర్పాట్లు.. కలెక్టర్‌, ఎస్పీకి ఆహ్వానం

కలం, ఆదిలాబాద్: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె. శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న వర్కింగ్‌ జర్నలిస్టుల రెండు రోజుల శిక్షణా తరగతులకు (Journalists Training Program) సంబంధించిన ఆహ్వానాన్ని మీడియా ప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌లకు అందజేశారు.

ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్‌ పర్యటనతో పాటు శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, ప్రొటోకాల్‌ చర్యలపై కలెక్టర్‌, ఎస్పీలకు వివరించారు. కార్యక్రమాన్ని సజావుగా, విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. జిల్లాలోని జర్నలిస్టులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీడియా ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల అధికారి ఇ. విష్ణువర్ధన్‌, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>