ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులపై కలెక్టర్ ఫోకస్

కలం, ఆదిలాబాద్: జిల్లాలో ప్రతిష్టాత్మక విమానాశ్రయ నిర్మాణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Collector Rajarshi Shah) సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విమానాశ్రయ ప్రాజెక్టు (Adilabad Airport Project) పనుల పురోగతిపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంగళవారం విమానాశ్రయ ప్రాజెక్టుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలు, తాజా నివేదికలతో అధికారులు పూర్తి సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా భూసేకరణ, క్షేత్రస్థాయి సర్వే తదితర కీలక అంశాలపై అధికారులతో చర్చించారు.

పనుల్లో ఎలాంటి జాప్యానికి తావులేకుండా సంబంధిత శాఖలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ జగదీష్, ఆర్డీఓ జగదీశ్వర్ రావు, ఎస్‌ఈ ప్రభు కళ్యాణ్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ సుభాష్, భూ సర్వే, కొలతల శాఖ ఏడి ప్రభాకర్, ఏవో వర్ణ, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఆర్‌అండ్‌బీ ఈఈ రమేష్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>