తరతరాల ఆచారం.. భక్తిశ్రద్ధలతో జాంబవంతుని పూజా కార్యక్రమం!

కలం, నర్సాపూర్ (జి) : నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో మాదిగ కుల సంఘం ఆధ్వర్యంలో ఆది జాంబవంతుని పూజా (Adi Jambavanthu) కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మూడు తరాలుగా వారసత్వంగా వస్తున్న ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తూ మైసమ్మ దేవతతో పాటు ఆది జాంబవంతునికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆనవాయితీని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం సభ్యులు ముత్యం, నరేందర్, సుధాకర్, సుబ్బయ్య, గంగారాం, రాజు, గంగాధర్, లస్మన్న, నారాయణ, రాము తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>