కలం, మహబూబ్ నగర్ బ్యూరో: బాలానగర్ (Balanagar) మండల పరిధిలో జరుగుతున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు, జాతీయ రహదారి వంతెన నిర్మాణ పనులను సోమవారం అదనపు కలెక్టర్ (ఎల్‌బీ) మధుసూదన్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పనులు జరుగుతున్న సమయంలో ప్రజా రవాణాకు ఎలాంటి అంతరాయం కలగకుండా, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, డిసెంబర్ మొదటి వారం నుంచి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకువస్తామని సంబంధిత వంతెన కాంట్రాక్టర్ హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు.

