డిజిటలైజేషన్ ప్రక్రియపై అదనపు కలెక్టర్ సమీక్ష

కలం, మహబూబ్‌నగర్: ప్రత్యేక సమగ్ర సవరణ (SIR–2026) కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని.. జడ్చర్ల ఎన్నికల నమోదు అధికారి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ(Additional Collector Hari Priya) అధికారులను ఆదేశించారు. ఆదివారం మిడ్జిల్ (Midjil) మండలం వేముల, వెలుగోముల, బైరాన్‌పల్లి గ్రామాల పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించి డిజిటలైజేషన్ పురోగతిని పరిశీలించారు.

ఆయా కేంద్రాలలో నమోదైన డిజిటలైజేషన్ శాతం తక్కువగా ఉండటాన్ని గమనించిన హరిప్రియ, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. బీఎల్‌వోలు ప్రతి ఎన్యుమరేషన్ ఫారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈఆర్‌ఓ/తహసీల్దార్, బీఎల్‌వో సూపర్వైజర్, గ్రామ సర్పంచ్, బీఎల్‌వోలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>