కలం, వెబ్ డెస్క్ : సొంత కుటుంబ సభ్యురాలైన కవిత అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేని దిక్కులేని స్థితిలో కేటీఆర్, హరీష్ రావు ఉన్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కవిత చెప్పినట్లుగానే హరీష్ రావు గుంటనక్క లాంటి వారని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, కేటీఆర్ నియంతృత్వ పోకడలతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్యేలకే నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించడం తప్పదనడం కేటీఆర్ (KTR) అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో గెలిచిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో అడ్డగోలుగా సంపాదించుకునే హక్కును కేసీఆర్ కట్టబెట్టారని, చివరికి గిరిజన ఎమ్మెల్యేలు అడుక్కున్నా నిధులు ఇవ్వలేదని ఆరోపించారు.
నాయకత్వ లక్షణాలు లేకపోయినా కేసీఆర్ కొడుకుగా పుట్టడమే అర్హతగా కేటీఆర్‌ను తెలంగాణ సమాజం ఇన్నాళ్లూ భరించాల్సి వచ్చిందని, కేసీఆర్ కొడుకు కాకపోతే కేటీఆర్‌కు రాజకీయ భవిష్యత్తే లేదని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర, ఆంధ్రా వ్యాపారులతో కలిసి కేసీఆర్ (KCR) చేసిన ఫామ్‌హౌస్‌లు, ఇతర వ్యాపారాల గురించి ప్రజలందరికీ స్పష్టంగా తెలుసని అన్నారు. గతంలో తెలంగాణ కోసం నిజాయితీగా కొట్లాడిన ఉద్యమకారులను అరెస్టు చేసి జైళ్లకు పంపారని, కోదండరాం, మందకృష్ణ మాదిగ వంటి వారిని వేధించారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని వారికి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కట్టబెట్టారని విమర్శించారు.
తెలంగాణ సమాజానికి కేసీఆర్ కుటుంబం చేసిన విధ్వంసం మామూలుది కాదని, ఆ పాపమే ఇప్పుడు వారిని వెంటాడుతోందని అద్దం(Addanki Dayakar)కి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదని తెలంగాణ ప్రజలు ఇప్పటికే గట్టిగా నిర్ణయించుకున్నారని తెలిపారు. ఉద్యమ ద్రోహులందరినీ పక్కన పెట్టుకుని పాలన సాగించిన వారు, ఇప్పుడు సుద్దపూసల్లా మాట్లాడుతుంటే ఎవరూ నమ్మరని అన్నారు. సొంత చెల్లెలు కవిత లేవనెత్తిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలని, డబ్బులు ఇచ్చి పాటలు పెట్టించుకునే పనులు మానుకుని నిజాయితీగా రాజకీయాలు చేయాలని కేటీఆర్, హరీష్ రావులకు హితవు పలికారు.
Also Read: నీరు ధండా బంగారు గురి.. భారత్‌కు మరో గోల్డ్ మెడల్!
Follow Us On: X(Twitter)

