ఆదివాసీ నాయక్‌పోడ్ జిల్లా కార్యవర్గం ఎన్నిక

కలం, నిర్మల్‌: నిర్మల్‌ (Nirmal) జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో ఆదివాసీ నాయక్‌పోడ్‌ (Adavasi Naikpod) సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చాకి లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శిగా సుంకరి ముత్యం, ఉపాధ్యక్షులుగా సుంచు సవీన్, శ్రీనివాస్‌, రమేష్‌, కోశాధికారిగా గుంజాల సాయి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి ఆదివాసీ నాయక్‌పోడ్‌ కులస్తులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. ఆదివాసీ నాయక్‌పోడ్‌ కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసి, కులస్తుల హక్కులు, సంక్షేమం కోసం ఐక్యంగా పని చేస్తామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>