భవిత కేంద్ర ప్రారంభం.. ఇళ్ల పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కలం, కుబీర్: ముధోల్‌ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. గురువారం కుబీర్‌ మండల కేంద్రంలో భవిత కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జడ్పీహెచ్‌ఎస్‌, కేజీబీవీ పాఠశాలలను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న విద్య, వసతులపై ఆరా తీశారు. కేజీబీవీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

అనంతరం కుబీర్‌లో నిర్మించనున్న వీఓ భవనానికి భూమిపూజ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఇళ్ల మంజూరు కోసం దళారులను ఆశ్రయించి డబ్బులు చెల్లించవద్దని సూచించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>