కలం, వెబ్‌డెస్క్: కింగ్‌డమ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇన్‌స్టా వేదికగా ఆసక్తికర పోస్టు చేసింది. తన లైఫ్‌లో ఎంతో ముఖ్యమైన జియా అనే సరికొత్త క్యారెక్టర్‌ను పరిచయం చేసింది. జియా అంటే తనతో పాటు తన ఇంట్లో అందరికీ ప్రాణమని చెప్పుకొచ్చింది. ఇంతకీ జియా అంటే ఎవరబ్బా అనుకుంటున్నారా? జియా అంటే భాగ్యశ్రీ పెంపుడు కుక్క పిల్ల. ఈ జియాను దత్తత తీసుకోవడం వెనుకున్న ఒక చిన్న కథను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అసలు తనకు కుక్కలను పెంచుకోవాలనే ఆలోచనే లేదని, కానీ మనాలి ట్రిప్‌లో లూనా (జియా తల్లి)ని చూసినప్పుడు మనసు మారిపోయిందని ఆమె పేర్కొంది. లూనా ఎంతో అందంగా, ఫ్ల్రెండ్లీగా ఉండటంతో ఆమెకు ఆ మూగజీవిపై ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడిందని, అది తన జీవితంలో ఒక మధురమైన మార్పుకు నాంది పలికిందని భాగ్యశ్రీ వివరించింది.
తాను మనాలి నుండి తిరిగి వచ్చేలోపే లూనా చిన్నారి జియాకు జన్మనిచ్చిందని, ఆ అద్భుత క్షణాన్ని స్వయంగా చూడటం తనకు ఎంతో స్పెషల్‌గా అనిపించిందని వెల్లడించింది. ఆ క్షణమే జియాను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం తమ ఇంట్లో జియానే అందరి ప్రాణమని ఎమోషనల్ అయిపోయింది. దీనికి సంబంధించిన క్యూట్ ఫోటోలు, వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో నెటిజన్లు ఆ పిక్స్‌పై కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరు నెటిజన్లకు భాగ్యశ్రీ రిప్లై ఇవ్వడం విశేషం.

