‘ది ప్యారడైజ్’ రిలీజ్.. నాని భార్య ఎమోషనల్ పోస్ట్!

కలం, వెబ్ డెస్క్: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఆయన భార్య అంజనా ఇన్ స్టాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరలవుతోంది. నాని తన కుమారుడితో ఉన్న వీడియోను షేర్ చేస్తూ రాశారు. ‘నాకు ఇంకా గుర్తు. 2009లో మేం కాలేజీకి బంక్ కొట్టి నీ (నాని) సినిమా చూసేందుకు వెళ్లాం. థియేటర్‌కు వెళ్లేసరికి కనీసం మార్నింగ్ షో కూడా లేదని తెలిసింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త వ్యక్తి తన సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలంటే ఎంత కష్టమో అప్పుడు అర్థమైంది. 17 ఏళ్లయిపోయింది. నీ సినిమా ప్యారడైజ్ విడుదలవుతోంది. ఇప్పుడు ప్రజలు ఎప్పుడెప్పుడు థియేటర్లకు వెళ్దామా.. అని ఎదురు చూస్తుంటే చాలా భావోద్వేగంగా, గర్వంగా అనిపిస్తోంది’ అన్నారు.

ఎప్పటికీ అండగానే..

ఇన్ స్టాలో అంజనా పోస్ట్ చేస్తూ.. ‘ఇదంతా ఒక్కో సినిమాతో నువ్వు ప్రేక్షకుల్లో సంపాదించుకున్న నమ్మకమే. ఈ ‘రోమ్’ ఒక్క రోజులో నిర్మాణం కాలేదు. అది ఎలా ఎదుగుతూ వచ్చిందో ప్రత్యక్షంగా చూసిన సాక్షుల్లో నేను ఒకరిని. నీ ప్రతి సినిమాను నీ బిడ్డలాగే చూశాను. కొన్ని సినిమాలు ఆగాయి.. కొన్ని పరుగెత్తాయి.. కొన్ని తడబడ్డాయి.. కానీ అవన్నీ సినిమాలే. ఈ రాత్రి ‘ది ప్యారడైజ్’ బిడ్డ లాగే చిన్న చిన్న నడకలు ప్రారంభించబోతుంది. ఏం జరిగినా అంతా మంచే జరుగుతుంది. అంతా బాగానే ఉంటుంది. మేం ఎప్పటికీ నీకు అండగానే ఉంటాం’ అని పోస్ట్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>