Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణవ్యాప్తంగా మీసేవ కేంద్రాలపై ఏసీబీ మెరుపు దాడులు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు మీసేవ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, అంబర్‌పేట్, అల్వాల్ ప్రాంతాల్లోని మీసేవ (MeeSeva) కేంద్రాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. వివిధ పౌర సేవలు, ధ్రువీకరణ పత్రాల జారీలో మీసేవ సిబ్బంది దళారులతో చేతులు కలిపి, జనాల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ సోదాల్లో భాగంగా దళారుల ప్రమేయం ఉన్నట్లు, నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>