ఫోన్ పే ద్వారా లంచం.. ఏసీబీ వలలో పంచాయతీ సెక్రటరీ!

కలం, కరీంనగర్ బ్యూరో : అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నేరుగా డబ్బులు తీసుకోవడానికి భయపడి డిజిటల్ పేమెంట్లను ఆశ్రయించినా ఏసీబీ అధికారులు వదలడం లేదు. పెద్దపల్లి (Peddapalli) జిల్లాలోని పొత్కపల్లి గ్రామం కార్యదర్శి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. గ్రామంలో ఒక ఇంటి పర్మిషన్ (అనుమతి) మంజూరుకు సెక్రటరీ కుమారస్వామి బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేశాడు.

రూ.5,000 లను ఫోన్ పే ద్వారా పంపాలని నిందితుడు సూచించాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. ఫోన్ పే ద్వారా చెల్లింపును గుర్తించి కుమారస్వామిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ పనుల కోసం సామాన్యులను ఇబ్బంది పెడుతూ లంచాలకు పాల్పడితే ఎంతటి వారైనా తప్పించుకోలేరని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.

Read Also: చెత్త ఆటోలో విద్యార్థులు.. పేరెంట్స్ ఫైర్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>