Mobile Popup Ad
Mobile Popup Ad

వ‌న్ మ్యాన్ క‌మిష‌న్ నివేదిక అమ‌లుకు హైలెవ‌ల్ క‌మిటీ

కలం, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ (TTD)లో నెయ్యి సేకరణ, నాణ్యత అంశాలపై వన్ మ్యాన్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలుపై హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా డీజీపీ సభ్యుడిగా, లా డిపార్ట్ మెంట్ సెక్రటరీ కన్వీనర్‌గా ఉన్నత స్థాయి కమిటీ నియమించింది. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని జీవో జారీ చేసింది.

తిరుమల లడ్డూపై ఏర్పాటైన ఏకసభ్య కమిటీ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక అందించింది. కొన్ని కీలక సిఫార్సులు కూడా చేసింది. మాజీ సీఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఏకసభ్య కమిటీ, టీటీడీ లడ్డు , నెయ్యి సరఫరా, వ్యవస్థాగత లోపాలు, విధాన పరమైన పొరపాట్లు, జవాబుదారీ తనం అంశాలపై విచారణ చేసింది. కొన్ని పరిశోధనల తర్వాత సిఫార్సులతో పాటు నివేదిక అందించింది. ప్రభుత్వం నివేదిక పరిశీలించిన తర్వాత తగిన చర్యలను తీసుకోవడానికి సిఫార్సులను అమలు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>