కలం, వరంగల్ బ్యూరో: జనగామ (Jangaon)లో నిర్వహించిన జనగణన అవగాహన కార్యక్రమానికి అధికారులు విద్యార్థులను స్వచ్ఛ ఆటోలో తరలించడం వివాదాస్పదంగా మారింది. చెత్త తరలింపుకు ఉపయోగించే వాహనంలో చిన్నారులను తీసుకెళ్లడంపై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనగణన అవగాహన కార్యక్రమం కోసం పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్థులను తీసుకొచ్చిన అధికారులు, కార్యక్రమం అనంతరం వారిని తిరిగి పంపించేందుకు చెత్త ఆటోను వినియోగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పిల్లల భద్రత, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఇలా వ్యవహరించడం బాధ్యతారాహిత్యమని ప్రజలు మండిపడుతున్నారు. ‘గణన’ లక్ష్యం కోసం అధికారుల ‘చెత్త’ పని ఇదేనా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చిన్నారులను చెత్త వాహనంలో తరలించడం అవమానకరమని, దీనిపై సంబంధిత అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
– చెత్త ఆటోలో విద్యార్థుల తరలింపు
-జనగామలో జనగణన అవగాహన కార్యక్రమం కోసం విద్యార్థులను తీసుకొచ్చిన అధికారులు
-ఈ కార్యక్రమం అనంతరం వారిని తిరిగి పంపించేందుకు చెత్త ఆటోను వినియోగించినట్లు ఆరోపణలు
Outrage in Jangaon: Students Transported in Garbage Trucks After Census Awareness… pic.twitter.com/nI7JD4E37x— Kalam Daily (@kalamtelugu) May 8, 2026

