సీఫర్ట్ ఔట్.. పీకల్లోతు కష్టాల్లో కివీస్

కలం, వెబ్​ డెస్క్​: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ చారిత్రక విజయానికి చేరువవగా, న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది(New Zealand Collapse). 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు, ఆ జట్టు టాప్ స్కోరర్ టిమ్ సీఫెర్ట్ అవుట్ కావడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. కేవలం 8.1 ఓవర్లలోనే 72 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ విలవిలలాడుతోంది. ప్రస్తుతం సగం ఓవర్లు ముగిసేసరికి 88/5తో ఉంది.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించిన ఏకైక బ్యాటర్ టిమ్ సీఫెర్ట్. ఈ ఓపెనర్​ కేవలం 26 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 52 పరుగులు చేసి ప్రమాదకరంగా మారాడు. అయితే, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి.. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ పట్టిన సూపర్​ క్యాచ్​తో వెనుదిరిగాడు. సీఫెర్ట్ అవుట్ కావడంతో కివీస్ శిబిరంలో ఆందోళన మొదలైంది.

భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ కకావికలమైంది(New Zealand Collapse). టిమ్ సీఫెర్ట్ 52 పరుగులు (వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అవుట్), ఫిన్ అలెన్ 9 పరుగులు (అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్), రచిన్ రవీంద్ర 1 పరుగు (జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అవుట్), గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులు (అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్), మార్క్ చాప్‌మన్ 3 పరుగులు (హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అవుట్) చేసి పెవిలియన్​కు చేరారు.

టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణిస్తూ కివీస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అక్షర్ పటేల్ 2 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా కేవలం 9 పరుగులే ఇచ్చి ఒక వికెట్ సాధించాడు. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా కూడా తలా ఒక వికెట్ పడగొట్టి న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు. ప్రస్తుతం క్రీజులో డారిల్ మిచెల్ (1*) ఉండగా, భారత్ విజయానికి కేవలం ఐదు వికెట్ల దూరంలో ఉంది. టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడానికి రంగం సిద్ధమైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>