కలం, వెబ్ డెస్క్ : జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసినందుకు తమ బృంద సభ్యులైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అజింక్య షిండేలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై సిజెపి నాయకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం చట్ట ఉల్లంఘన ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.
సొంత దేశంలో జాతీయ జెండాను చేతిలో పట్టుకుని నినాదాలు చేస్తే అరెస్ట్ చేయడం సర్కార్ నియంతృత్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. జంతర్ మంతర్ వద్ద జెండా ఎగరవేస్తే తప్పుపట్టేవారే అసలైన దేశద్రోహులని వ్యాఖ్యానించారు. భారత జాతీయ పతాకాన్ని గౌరవిస్తూ రెపరెపలాడించిన వారిని వెంటనే విడుదల చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

