విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి: అదనపు కలెక్టర్

కలం, యాదగిరిగుట్ట: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించడంతో పాటు ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యంపై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్(Additional Collector) భాస్కర్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం మోటకొండూరు మండల కేంద్రంలోని MJPT పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

భోజనం నాణ్యత, మెనూ అమలు తీరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా ముచ్చటించిన అదనపు కలెక్టర్.. భోజనం రుచిగా ఉంటుందా? మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా? పాఠశాలలో వసతులు ఎలా ఉన్నాయి? ఉపాధ్యాయుల బోధన తీరు ఎలా ఉందనే అంశాలపై ఆరా తీశారు. విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకుంటూ పాఠశాలలోని పరిస్థితులను సమీక్షించారు. అనంతరం పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందించాలని, పాఠశాల పరిసరాలను నిరంతరం శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

భోజనం అందించడమే కాకుండా విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు, మానసిక వికాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు అందించే భోజనం నుంచి పాఠశాలలోని వసతుల వరకు ప్రతి అంశంలో నాణ్యత కనిపించాలని అదనపు కలెక్టర్ ఈ పర్యటన ద్వారా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>