ప్రజలకు సకాలంలో పౌర సేవలు అందించాలి: కలెక్టర్ రాజర్షిషా

కలం, ఆదిలాబాద్: జిల్లాలో ప్రజలకు పారదర్శకంగా, నాణ్యమైన పౌర సేవలను అందించడమే లక్ష్యంగా గ్రామాలు, మండలాల స్థాయిలో కొత్త మీ సేవ కేంద్రాల(MeeSeva Centre) కేటాయింపు ప్రక్రియను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని మసూద్‌ చౌక్‌లో సైఫ్‌ అహ్మద్‌ మసూద్‌కు మంజూరైన నూతన మీ సేవ కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గత కొద్ది నెలలుగా జిల్లాలో అవసరమైన ప్రాంతాలను గుర్తించి కొత్త మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు ఎన్నో కీలక సేవలు అందుతున్నాయని, వివిధ ధ్రువపత్రాల జారీ, భూ భారతి సంబంధిత అంశాలు, ఆలస్యంగా నమోదయ్యే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పట్టణ ప్రణాళిక వంటి అనేక సేవలను ప్రజలకు సకాలంలో అందించాలని సూచించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>