పత్తి చేనులో విషాదం.. పాము కాటుతో మహిళ మృతి!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా తల్లాడ (Thallada) మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పత్తి ఏరేందుకు పొలానికి వెళ్లిన ఓ వివాహితను పాము కాటేయడంతో (Snakebite) ఆమె ప్రాణాలు కోల్పోయింది.​ తల్లాడ మండలంలోని తెలగవరం గ్రామానికి చెందిన తేల్లూరి వాణి (30) మంగళవారం తెల్లవారుజామున గ్రామంలోని పొలానికి పత్తి తీసేందుకు వెళ్లింది.

ఈ క్రమంలో ఆమెను ప్రమాదవశాత్తూ పాము కాటేసింది. విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది.

​మృతి చెందిన వాణికి భర్త వెంకన్న, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తల్లిని కోల్పోయి అనాథలుగా మారిన ఆ పిల్లల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. పిల్లాపాపలతో సంతోషంగా సాగాల్సిన కుటుంబంలో ఈ దుర్ఘటన జరగడంతో తెలగవరం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>